News July 20, 2024

ప.గో.: జులై 22 వరకు సముద్రంలో వేట నిషేధం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. ప.గో. జిల్లాలోని చినలంక, పీఎం లంక, పేరుపాలెం, కేపీపాలెం వద్ద సముద్రం ఉద్ధృతంగా కనిపిస్తోంది. అల్పపీడనం హెచ్చరికతో మత్స్యశాఖ అధికారులు ఈ నెల 22 వరకు వేట నిషేధ ఆజ్ఞలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లన్నీ తీరానికి చేరుకుంటున్నాయి. కొన్ని నరసాపురం వద్దకు రాగా మరికొన్ని అంతర్వేదిలో ఆగాయి.

Similar News

News March 17, 2026

ప్రభుత్వ ఆదాయం పెంపునకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించడంలో ప్రతి శాఖ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జీఎస్టీ సమన్వయ సమావేశం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ, ఇతర ఆదాయార్జన శాఖల అధికారులు పాల్గొన్న ఈ సభలో.. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. ఆదాయ వనరులను మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

News March 17, 2026

ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్.. 24 అర్జీల స్వీకరణ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి 24 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్‌ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

News March 17, 2026

ఏలూరు రాజకీయాల్లో “పుట్టా“ రచ్చ

image

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరు రాజకీయాల్లో హైదరాబాద్ ఫాంహౌస్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ తీసుకునే పార్టీలో ఎంపీ పట్టుబడటం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్‌లో పాజిటివ్ రావడాన్ని ఈగల్ టీమ్ SP ధృవీకరించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకొస్తానని MP అంటున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు సైతం ఎంపీపై కుట్ర జరుగుతోందంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.