News July 20, 2024
కాజీపేట నుంచి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా పట్నా, దానాపూర్ నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 03253 పట్నా-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 వరకు, 07255 హైదరాబాద్- పట్నా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 2 వరకు, 03225/26 దానాపూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబరు 29 వరకు పొడిగించారు. రైళ్లలో రద్దీ అధికంగా ఉండటం వల్ల రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News August 21, 2025
డ్రగ్ సంబంధిత సమాచారం ఇవ్వండి: వరంగల్ సీపీ

డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇవ్వడానికి 1908కు కాల్ చేయాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ప్రజలను కోరారు. ఎవరి వద్దనైనా డ్రగ్స్ వ్యాపారం, వాడకం లేదా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చే వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. డ్రగ్స్ సమాజాన్ని నాశనం చేస్తాయన్నారు.
News August 21, 2025
WGL: రైల్వే స్టేషన్లో గోడను ఢీకొన్న గూడ్స్ రైల్

వరంగల్ రైల్వే స్టేషన్లో గురువారం ఉదయం ప్రమాదం సంభవించింది. వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ గూడ్స్ రైలు రివర్స్ వస్తూ రైల్వే స్టేషన్ ముందున్న ఏటీఎం పక్క గోడను తగిలింది. ఈ ఘటనలో గోడ ధ్వంసం కాగా, ఎవరికీ ఏం కాలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
News August 21, 2025
వరంగల్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు: కలెక్టర్

యూరియా కొరత, ఇతర వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం రైతులు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 18004253424, ఫోన్ నంబర్లు 0870-2530812, 9154252936లకు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.