News July 20, 2024

లష్కర్‌ బోనాల ఏర్పాట్లు పరిశీలించిన పొన్నం

image

రేపు, ఎల్లుండి లష్కర్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ అధికారులు, పోలీసులను ఆయన ఆదేశించారు. బోనాలు తీసుకొచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేయాలన్నారు. 

Similar News

News February 9, 2026

HYDలో తీవ్ర విషాదాలు..!

image

HYDలో వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. చర్లపల్లిలో పిల్లలతో కలిసి విజయారెడ్డి డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. దీనికి ముందు యువతి డిప్రెషన్‌తో ట్యాంక్‌బండ్‌లో దూకింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీశ్ పనిఒత్తిడితో ఉరేసుకున్నాడు. కూకట్‌పల్లిలో వివాహిత అనిత అనారోగ్యంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. ఒత్తిడికి గురైతే పిల్లలు, తల్లిదండ్రులతో గడపాలని నిపుణులు చెబుతున్నారు.

News February 9, 2026

హైదరాబాద్‌ మెట్రో.. క్రియేటివ్ రీల్స్ అడ్డా!

image

HYD మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, యువత క్రియేటివిటీకి సరికొత్త వేదికలుగా మారుతున్నాయి. రాయదుర్గం నుంచి ఎల్బీనగర్ వరకు సాగే ప్రయాణంలో రీల్స్ షూటింగ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనతో కుర్రకారు హల్చల్ చేస్తోంది. క్లబ్‌లు, కేఫ్‌ల కంటే మెట్రోలోనే నెట్‌వర్కింగ్ జోన్లు వెలుస్తున్నాయి. ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా వైరల్ వీడియోలు సృష్టిస్తూ మెట్రోను ఒక క్రియేటర్ స్టూడియోగా మార్చేస్తున్నారు.