News July 20, 2024
వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరద ప్రవాహాల వద్దకు సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదాలకు బారిన పడవద్దని, అత్యవసర సమయంలో 100కు ఫోన్ చేసి సాయం పొందాలని, శిథిలావస్థకు వచ్చిన నివాసాల్లో ఉండవద్దని, చేపల వేటకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు వద్దకు వెళ్లకూడదన్నారు.
Similar News
News January 12, 2026
నల్గొండ: ప్రజావాణిలో కలెక్టర్కు సమస్యలపై వినతి

నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అన్నెపర్తిలో ఓ ఇంటి వివాదం, నల్గొండలోని 20వ వార్డులో డ్రైనేజీ సమస్యలతో పాటు, మంజూరై ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్కు వివరించారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవి, శ్రవణ్, నవీన్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
News January 12, 2026
NLG: జిల్లాలో పెరుగుతున్న రాజకీయ వేడి!

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు అడుగులు వేస్తుండడంతో బల్దియాల్లో రాజకీయం వేడెక్కుతోంది. ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి, అనుకూలించకపోతే ఏం చేయాలన్న విషయమై ఆశావహులు లెక్కలు వేసుకుంటున్నారు. NLG జిల్లాలో ప్రధానంగా NLG (ఇప్పుడు కార్పొరేషన్), MLG, CTL, DVK, HLY, CDR, నందికొండ, నకిరేకల్ వంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవాళ వార్డుల వారిగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.
News January 12, 2026
NLG: కల చెదిరి.. కళ తప్పి

ఉమ్మడి జిల్లాలో గంగిరెద్దులను ఆడించే వారి జీవనం కష్టతరంగా మారింది. ఆదరణ కరువై, పొట్టకూటి కోసం వేరే పనులు చూసుకుంటున్నారు. ఏటా సంక్రాంతి సందర్భంగా రంగు రంగుల బట్టలు, గంటలు, మువ్వలతో ఇంటింటికీ తిరిగి అలరించే డూడూ బసవన్నల గొంతులు మూగబోతున్నాయి. ఆధునిక కాలంలో యాంత్రిక జీవనం పెరగడం, వినోద సాధనాలు మారడంతో ఈ కళ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. రాను రాను అంతరించిపోయిన జాబితాలో చేరేలా కనిపిస్తోంది.


