News July 20, 2024
వారికెందుకు చోటు దక్కలేదో అర్థం కావట్లేదు: భజ్జీ

శ్రీలంక టూర్‌కు అభిషేక్ శర్మ, చాహల్‌ను అసలు ఎంపిక చేయకపోవడం, సంజూ శాంసన్‌ను టీ20లకు మాత్రమే ఎంపిక చేయడం పట్ల హర్భజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘చాహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఎందుకు లేరు? నాకు అసలు అర్థం కావడం లేదు’ అని ట్వీట్ చేశారు. తన రెండో T20I మ్యాచ్‌లోనే అభిషేక్ 100 బాదగా, సంజూ సైతం తన చివరి వన్డేలో సెంచరీ చేశారు. అటు చాహల్ ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరిచారు.
Similar News
News December 28, 2025
సభా సమయం.. వేడెక్కిన రాజకీయం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేతల కామెంట్లతో రాజకీయం వేడెక్కింది. సభలో ప్రభుత్వం హుందాగా ప్రవర్తిస్తుందని, ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అటు ఎన్నిరోజులైనా సభను నడుపుతామని చెప్పే ప్రభుత్వం ఒక్కరోజుతో సమావేశాలు ముగించేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కనీసం 15రోజులైనా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు.
News December 28, 2025
జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండాలంటే?

జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అంటున్నారు నిపుణులు. దీనికోసం రోజూ ధ్యానం చెయ్యడం, పజిల్స్ నింపడం, పుస్తకపఠనం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిదని సూచిస్తున్నారు. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. దీంతో పాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుందంటున్నారు.
News December 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 110 సమాధానం

ఈరోజు ప్రశ్న: కర్ణుడి అసలు పేరేంటి? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ తర్వాత కర్ణుడిలా ఎందుకు మారింది?
సమాధానం: కర్ణుడి అసలు పేరు ‘వసుషేణుడు’. అతను జన్మతః ఒంటిపై బంగారు కవచకుండలాలతో పుట్టడం వల్ల ఆ పేరు వచ్చింది. అయితే ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అడగగానే తన ప్రాణాలకు రక్షణగా ఉన్న ఆ కవచ కుండలాలను శరీరం నుండి కోసి (కర్తనం చేసి) దానం చేయడం వల్ల, అతనికి ‘కర్ణుడు’ అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


