News July 20, 2024

మెండోరా: ‘నా భర్త మృతదేహాన్ని తెప్పించండి సారూ’

image

నిజామాబాద్ జిల్లా మెండోరాకు చెందిన మాకురి వినోద్ బతుకుదెరువుకోసం బెహరన్ దేశం వెళ్లాడు. కాగా ఈనెల17న డ్యూటీలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వినోద్ మృతదేహన్ని త్వరగా స్వదేశానికి తీసుకు వచ్చేలా చూడాలని అతని భార్య యమున, పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Similar News

News August 22, 2025

బీజేపీ నిజామాబాద్ జిల్లా నూతన కమిటీ నియామకం

image

బీజేపీ జిల్లా నూతన కమిటీని గురువారం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పోతన్ కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేశ్వర్, బంటు రాము, రాంచందర్, సురేందర్, ప్రమోద్, పాలేపు రాజు, జిల్లా కార్యదర్శులుగా అనిల్, నర్సారెడ్డి, వేణు, జ్యోతి, రాధ, సవితను నియమించారు.

News August 21, 2025

డిచ్పల్లి: PG పరీక్షలను పరిశీలించిన TU రిజిస్ట్రార్

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలను TU రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం 5వ రోజు పరీక్షల్లో భాగంగా ఉదయం పరీక్షకు 80 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.

News August 21, 2025

రూ.50.95 కోట్ల రుణాలు: NZB కలెక్టర్

image

జిల్లాలో ఇప్పటి వరకు 4,348 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు రూ.50.95 కోట్ల రుణాలు మంజూరు చేశామని NZB కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 3,916 మంది లబ్ధిదారులకు రూ.46.59 కోట్లు, మెప్మా ద్వారా 432 మందికి రూ.4.36 కోట్లు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం మంజూరు చేశామన్నారు. లబ్ధిదారులు వెంటనే ఇంటి నిర్మాణ పనులను చేపట్టాలని కలెక్టర్ కోరారు.