News July 20, 2024
సికింద్రాబాద్ మహంకాళికి బోనం సమర్పించిన దీపాదాస్ మున్షీ

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, యూఎస్ కన్సులేట్ జనరల్ జెన్నిఫర్ ఎ.లార్సన్, మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ సనత్‌నగర్ ఇన్‌ఛార్జ్ కోట నీలిమ, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News January 20, 2026
HYD శివారులో సంజీవని!

నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేల కలుషితమవుతున్న వేళ ‘మైకోరైజా’ అనే మేలు చేసే శిలీంధ్రాలు రైతులకు వరంగా మారనున్నాయి. ఈ ప్రత్యేక శిలీంధ్రాలు భూమిలోని పోషకాలను వేర్లకు అందించి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించే అవకాశం లభిస్తుంది. దీంతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ విషం లేని ఆహారాన్ని అందించనుంది.
News January 20, 2026
ఖైరతాబాద్ మైనారిటీ గురుకులాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ హబీబ్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి సీట్లు రిజర్వు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 9182628275 నంబరును సంప్రదించాలని కోరారు.
News January 20, 2026
HYD: మల్లారెడ్డి కాలేజీలో గంజాయి కలకలం

మల్లారెడ్డి కాలేజ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఒకటిన్నర లీటర్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు అమ్ముతుండగా, నలుగురు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ నుంచి ఒడిశాకు వెళ్లి గంజాయి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు.


