News July 20, 2024
IPL: ఢిల్లీ క్యాపిటల్స్ మరో సంచలన నిర్ణయం?
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రిషభ్ పంత్‌ను వేలానికి వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మళ్లీ వేలంలో కొనడానికి కూడా ఆసక్తిచూపడం లేదని టాక్. మరోవైపు పంత్‌ను దక్కించుకోవాలని సీఎస్కే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలోకి రాకముందే ట్రేడింగ్ ద్వారా ఆయనను సొంతం చేసుకునేందుకు DCతో ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News December 26, 2024
మస్కట్ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్
AP: మస్కట్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.
News December 26, 2024
Latest Data: ఓటింగ్‌లో మహిళలే ముందు
2024 సార్వత్రిక ఎన్నికల్లో 65.78% మంది అర్హత కలిగిన మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. పురుషులు 65.55% మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. తద్వారా వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయడం గమనార్హం.
News December 26, 2024
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?
ట్యాక్స్ పేయర్స్కి ఊరట కలిగించేలా 2025 బడ్జెట్లో కేంద్రం నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన పన్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 లక్షల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశం అర్థిక సవాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో Tax Payersకి ఊరట కలిగించేలా Budgetలో నిర్ణయాలుంటాయని సమాచారం.