News July 20, 2024
వర్షం వస్తోంది.. వేడిగా ఏమైనా తింటున్నారా?
వర్షం ముసురేస్తుంటే ఇంట్లో ఏదో ఒకటి వేడివేడిగా తినాలని అనిపిస్తుంది. ప్రాంతాలను బట్టి వేర్వేరు రెసిపీలు చేసుకొని తింటుంటారు. మొక్కజొన్న కంకులు కాల్చి వాటిపై నిమ్మరసం, కాస్త ఉప్పు-కారం చల్లి తింటే ఆ టేస్టే వేరు. పాప్ కార్న్, ఆనియన్ పకోడి, మిరపకాయ/ఆలూ బజ్జీలు, పప్పు గారెలు బయటివి కాకుండా ఇంట్లో చేసుకుంటే బెటర్. వీటిలోకి కాంబినేషన్‌గా టీ మరిచిపోవద్దండోయ్. ఇంతకీ వర్షం వస్తే మీరేం తింటారు?
Similar News
News January 26, 2025
సింగర్‌తో సిరాజ్.. ఫొటోతో డేటింగ్ రూమర్స్
టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనై భోస్లే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనై ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తన బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటోల్లో హైదరాబాదీతో క్యాండిడ్ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్‌తో ఆశా భోస్లే మనవరాలు డేటింగ్‌లో ఉందనే కామెంట్లు గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరి వైపు నుంచి ఏ స్టేట్‌మెంట్ రాలేదు.
News January 26, 2025
విజయ్ చివరి మూవీ టైటిల్ ఇదే
తమిళ హీరో విజయ్ నటించనున్న చివరి మూవీకి ‘జన నాయగన్’ టైటిల్ ఖరారైంది. ఈ విషయాన్ని తెలుపుతూ హీరో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టర్ షేర్ చేశారు. బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ మూవీకి వినోద్ దర్శకుడు. TVK పేరుతో రాజకీయ పార్టీ ప్రారంభించిన ఇళయ దళపతి సందేశాత్మక చిత్రంతో సినీ కెరీర్ ముగించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
News January 26, 2025
మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
నీటి కింది నుంచి ఉపరితలంపైకి ప్రయోగించగల క్రూయిజ్ క్షిపణిని ఉత్తర కొరియా తాజాగా పరీక్షించింది. ఆ దేశ అధికారిక మీడియా KNCA ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ప్రయోగాన్ని దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారని పేర్కొంది. ఈ క్షిపణి ప్రయోగం విజయంతో తమ సైన్యం మరింత బలోపేతమైందని హర్షం వ్యక్తం చేసింది. మున్ముందు మరింత బలంగా మారతామని, శత్రువులకు తగిన సమాధానమిస్తామని స్పష్టం చేసింది.