News July 20, 2024
HYD: అర్ధాంగి లేదనే బాధతో మృతిచెందిన భర్త

ఆలు మగలవి ఒక జీవితానికి చాలని ప్రేమలని ఓ కవి అన్నారు. అర్ధాంగిని కోల్పోయిన బాధను జీర్ణించుకోలేని ఓ భర్త మనోవేదనతో తనువు చాలించిన విషాద ఘటన ఇది. సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్, స్కందగిరిలో కొంతకాలంగా జిల్లా లక్ష్మణ్(80) నీలవేణి (70) కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. గత నెల 22న అనారోగ్యంతో నీలవేణి చనిపోయారు. దీంతో మనోవేదనకు గురైన భర్త శనివారం తనువు చాలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Similar News
News October 28, 2025
జూబ్లీ బైపోల్: మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
రహమత్‌నగర్- కోమటిరెడ్డి, పొంగులేటి, బోరబండ- సీతక్క, మల్లు రవి, వెంగళ్రావునగర్- తుమ్మల, వాకిటి శ్రీహరి, సోమాజిగూడ- శ్రీధర్ బాబు, అడ్లూరి, షేక్‌పేట్- కొండా సురేఖ, వివేక్, ఎర్రగడ్డ- దామోదర, జూపల్లి, యూసుఫ్‌గూడ- ఉత్తమ్, పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు.
News October 28, 2025
శంకర్ మఠాన్ని సందర్శించిన రాంచందర్‌రావు

HYDలోని నల్లకుంట శృంగేరి శంకర్ మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సందర్శించారు. శ్రీ శారదాంబ అమ్మవారిని దర్శించుకొని, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
News October 28, 2025
HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.


