News July 20, 2024

నిండుకుండలా హుస్సేన్ సాగర్.. 2 గేట్లు ఎత్తివేత

image

TG: హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద రావడంతో నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. చెరువు పూర్తి సామర్థ్యం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

Similar News

News January 13, 2026

ధనుర్మాసం: ఇరవై తొమ్మిదో రోజు కీర్తన

image

కృష్ణుడిని సేవిస్తూ అండాళ్ తెలిపిన వ్రత పరమార్థం ఇది: ‘ఓ గోవిందా! మేము వేకువనే నీ సన్నిధికి వచ్చింది కోరికలు నెరవేర్చమని కాదు! మా జన్మజన్మల బంధం నీతోనే ఉండాలని, ఏడేడు జన్మల వరకు నీకే దాస్యం చేస్తూ నీ సేవలో తరించాలని! మా మనసులో ఉండే ఇతర కోరికలను తొలగించు. నీ పాద సేవ పట్ల అనురక్తిని ప్రసాదించు’ అని భగవంతుడిని ఏమీ ఆశించకుండా, నిరంతర సేవా భాగ్యాన్ని కోరుకుంటున్నారు. ఇదే నిజమైన భక్తి. <<-se>>#DHANURMASAM<<>>

News January 13, 2026

SBI ఖాతాదారులకు అలర్ట్

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ATMల్లో ఫ్రీ ట్రాన్సాక్షన్లు సంఖ్య (నెలకు 5) కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. ఇక బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్‌ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.

News January 13, 2026

ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

image

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.