News July 20, 2024
వైసీపీ కార్యకర్త హత్యపై స్పందించిన సీఎం చంద్రబాబు

AP: పల్నాడు జిల్లా వినుకొండ <<13650476>>హత్య<<>> గంజాయి వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ పెంచి, పోషించిన గంజాయి, డ్రగ్స్ సంస్కృతి వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో శ్వేతపత్రాల్లోని వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఢిల్లీ వెళ్తామని డ్రామాలు ఆడుతున్నారని TDP ఎంపీలతో సమావేశంలో విమర్శించారు.
Similar News
News November 10, 2025
SIGMA: దళపతి విజయ్ కొడుకు దర్శకత్వంలో సందీప్ కిషన్

తమిళ స్టార్ దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా సందీప్ కిషన్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘SIGMA’ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో సందీప్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
News November 10, 2025
NEET PG ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

నీట్ పీజీ ఫేజ్1 కౌన్సెలింగ్ గడువు ఈనెల 5తో ముగియగా తాజాగా MCC దాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చంది. సమాచారం కోసం వెబ్సైట్‌ను ఫాలో కావాలని సూచించింది. కాగా పరీక్ష పారదర్శకంగా ఉండడం లేదని, ఆన్సర్ కీ పబ్లిష్ చేయాలని ఇంతకు ముందు SCలో కేసు దాఖలైంది. కోచింగ్ సెంటర్లే ఇలా కేసులు వేయిస్తున్నాయని NBE వాదిస్తోంది. దీనిపై అఫిడవిట్ వేయాలని SC ఇటీవల ఆదేశించింది.
News November 10, 2025
CSK నుంచి జడేజా ఔట్?

రాజస్థాన్‌తో ట్రేడ్ డీల్‌లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. RR నుంచి సంజూను తీసుకునేందుకు చెన్నై ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జడేజా ఇన్‌స్టా అకౌంట్ కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రేడ్ డీల్ తర్వాత ఫ్యాన్స్ వార్‌ను నివారించడానికి అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారా? లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియరాలేదు.


