News July 20, 2024

భద్రాచలం: లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్

image

భద్రాచలం నుండి 5 లక్షల 89 వేల 743 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావొద్దని చెప్పారు. ఏదేని అత్యవసర సేవలకు 24 గంటలు పనిచేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News August 21, 2025

ఖమ్మం: ఈ ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదు

image

జిల్లాలో బుధవారం ఉదయం 8:30 నుంచి గురువారం ఉదయం 8:30 వరకు 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఖమ్మం రూరల్ 3.4, కామేపల్లి, చింతకాని, వైరా 1.2, ఏన్కూరు 1.0, నేలకొండపల్లి మండలంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. అటు ఇతర మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని పేర్కొన్నారు.

News August 21, 2025

ఖమ్మం: ఐబీ శాఖలో DEEలు, EEలకు అదనపు బాధ్యతలు

image

ఖమ్మం జిల్లా జల వనరుల శాఖలో ఖాళీగా ఉన్న స్థానాల్లో డీఈఈలు, ఈఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలాయపాలెం డీఈఈ రమేశ్‌రెడ్డికి పాలేరు ఈఈగా, ఖమ్మం సీఈ కార్యాలయంలో డీఈ కె.శోభారాణికి అదే కార్యాలయంలో డీసీఈగా, సత్తుపల్లి ఈఈ ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డికి కల్లూరు డీఎస్‌ఈగా, మధిర డీఈఈ రాంప్రసాద్‌కు మధిర ఈఈగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News August 21, 2025

ఖమ్మం: ఉపాధ్యాయుల పదోన్నతులకు లైన్ క్లియర్

image

ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిం చేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉదయం వరకు సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్ఏలు వెన్ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జోనల్ స్థాయిలో 1,300 మందికి అవకాశముండగా, ఖమ్మం జిల్లాలో 70 మంది హెచ్ఎంలుగా పదోన్నతి పొందనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎస్ఓటీలకు ఎస్ఏలుగా పదోన్నతి కల్పించనున్నారు.