News July 20, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు రైల్వే సూపర్ ఆఫర్

image

ఇండియన్ రైల్వే ప్రత్యేక ఎయిర్ ప్యాకేజీలను ప్రారంభించినట్లు ఐఆర్‌సీటీసీ రీజనల్ మేనేజర్ డాక్టర్ క్రాంతి శనివారం తెలిపారు. థాయిలాండ్ టూర్ ఆరు రోజుల ప్యాకేజీ 7 సెప్టెంబరు నుంచి 12వ తేదీ వరకు, దక్షిణ దివ్య ఆలయ పర్యటన ప్యాకేజీ 6 రోజులకి 14 ఆగస్టు నుంచి 19వ తేదీ వరకు తక్కువ ధరలకు ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల ప్రయాణికులు 92810 30748 సంప్రదించాలన్నారు.

Similar News

News July 5, 2025

శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు శుభవార్త

image

శ్రీకాకుళం రోడ్ పలాస మీదుగా SMVT బెంగుళూరు(SMVB)- నారంగి(NNGE) మధ్య నడుస్తున్న 2 ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు నడిచేలా పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06559 SMVB- NNGE రైలు జులై 8, 15 తేదీలలో, నం.06560 NNGE- SMVB మధ్య నడిచే రైలు జులై 12, 19 తేదీలలో ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News July 5, 2025

జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలు గుర్తింపు: కలెక్టర్

image

జిల్లాలో 75,556 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. 181 కుటుంబాల్ని దత్తత తీసుకున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జులై 15లోగా మిగతా కుటుంబాలకు దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని అన్నారు. పాతపట్నంలో అత్యధికంగా నమోదయ్యారన్నారు.

News July 4, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు