News July 20, 2024
శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

శ్రీకాకుళం: ప్రయాణికులకు రైల్వే సూపర్ ఆఫర్ *ఈ నెల 23 నుంచి 27 వరకు జిల్లాలో ప్రత్యేక ఆధార్ డ్రైవ్ *మాదకద్రవ్యాల నిర్మూలనకి చర్యలు: రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అప్పారావు *రణస్థలం మండలం తోటపల్లి కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే *శ్రీకాకుళం జిల్లాకు తప్పిన వాయుగుండం ముప్పు: జేసీ నవీన్ *ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడి మృతి
Similar News
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
News November 8, 2025
కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.


