News July 20, 2024

కోనసీమ: తండ్రిని కొట్టాడని ఫ్రెండ్స్‌తో కలిసి చంపేశాడు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నరేశ్(38)కు మతిస్థిమితం లేదు. తరచూ గొడవ పడుతుంటాడు. ఇంటి వెనుక ఉండే అప్పారావును గతంలో కొట్టగా.. అతడి కొడుకు పోతురాజు నరేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 15న పోతురాజు అతడి ఫ్రెండ్స్ రాజు, కె.రాంబాబు, శ్రీను, డి.రాంబాబుతో కలిసి దాడి చేయగా నరేశ్ మృతి చెందాడు.

Similar News

News January 1, 2026

న్యూ ఇయర్ విషెస్ తెలిపిన కలెక్టర్

image

నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరిని జిల్లా అధికారులు, సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, జిల్లా ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి నోట్ పుస్తకాలు, విద్యార్థులకి ఉపయోగపడే పుస్తకాలు అందచేయడం పట్ల అభినందనలు తెలిపారు.

News January 1, 2026

‘జిల్లాలో 12% పెరిగిన రోడ్డు ప్రమాదాలు’

image

గడిచిన ఏడాదితో పోల్చితే 2025లో రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.2024 లో 309 ప్రమాదా లు సంభవిస్తే 39 మంది మృతి చెందగా, 624 మంది గాయపడ్డారు.2025 లో 309 రోడ్డు యాక్సిడెంట్లైతే 335 మంది మృతి చెందగా 728 మంది క్షతగాత్రులయ్యారని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, తాగి వాహనాలు నడపడం మూలంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

News January 1, 2026

2025లో జిల్లాలో ఏ నేరాలు ఎన్ని జరిగాయో తెలుసా..?

image

జిల్లాలో గత ఏడాదితో పోల్చితే 2025 సంవత్సరంలో 15% ప్రమాదాలు తగ్గాయని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. 2024లో 7,586 కేసులు నమోదైతే, 2025లో 6,477 నమోదైనట్లు తెలిపారు. సైబర్ నరాలు 140 నుంచి 123కి, పోక్సో కేసులు 114 నుంచి 110కి, ఆర్థిక నేరాలు 355 నుంచి 302కి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 101 నుంచి 64కి, మాదకద్రవ్యాల కేసులు 69 ఉంటే 52కి, శారీరిక నేరాలు 76 నుంచి 697కు తగ్గాయన్నారు.