News July 21, 2024

TODAY HEADLINES

image

➣ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు
➣జగన్ పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్ వల్లే అరాచకాలు: CBN
➣TG: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: రేవంత్
➣నీట్ యూజీ ఫలితాలు విడుదల
➣యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా
➣AP: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
➣TG: ‘మేడిగడ్డ’ నిలబడింది.. కేసీఆర్‌కు సెల్యూట్: కేటీఆర్
➣సానియాతో పెళ్లి వార్తలను ఖండించిన క్రికెటర్ షమీ

Similar News

News January 24, 2025

జీతం ఆలస్యమైతే.. ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?

image

అనుకోని సందర్భాల్లో జీతం ఆలస్యమైతే ఏం చేస్తారు? చాలామంది ఉద్యోగులకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడెలాగూ చాలామందికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అందుకే వచ్చిన జీతంలో ప్రతినెలా కొంత మొత్తాన్ని మరో ఖాతాకు బదిలీ చేసుకోవాలి. దీంతో అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉపయోగపడటంతో పాటు అప్పుల్లో కూరుకుపోకుండా చేస్తుంది. మరి మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?

News January 24, 2025

సైఫ్ అలీ‌ఖాన్‌పై దాడి.. ఆ వేలిముద్రలు నిందితుడివే!

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో పట్టుబడిన నిందితుడి, ఘటనాస్థలిలో దొరికిన వేలిముద్రలు ఒకటే అని పోలీసులు నిర్ధారించారు. నటుడి ఇంటి వద్ద CC ఫుటేజీలో కనిపించిన వ్యక్తి తన కుమారుడు కాదని నిందితుడి తండ్రి వారించారు. దీంతో సైఫ్ ఇంట్లోకి వెళ్లేందుకు నిందితుడు ఎక్కిన పైప్, తలుపులపై ఉన్న వేలిముద్రలను పరిశీలించారు. సైఫ్ 2వ కుమారుడి గదిలో దొరికిన క్యాప్‌కు ఉన్న వెంట్రుకను సైతం పోలీసులు DNA టెస్టుకు పంపారు.

News January 24, 2025

మీ పిల్లలు ఎంతసేపు నిద్ర పోతున్నారు?

image

పోషకాహారంతో పాటు సరైన నిద్ర పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. 6-12 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు కనీసం 9గంటల పాటు నిద్రపోవాలని సూచిస్తున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోతే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుకు గురవుతారని చెబుతున్నారు. వీళ్లు సరైన నిర్ణయాలు తీసుకోలేరని, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నిద్ర సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.