News July 21, 2024
ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తాం: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో టీఎన్జీవో ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. బదిలీలకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ, కార్యదర్శి రవి, అసోసియేట్ అధ్యక్షులు శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News August 21, 2025
ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలి: కలెక్టర్, ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వివిధ మండప నిర్వాహకులు పాల్గొన్నారు. సభ్యుల సందేహాలను కలెక్టర్, ఎస్పీ నివృత్తి చేశారు.
News August 20, 2025
మెదక్: అక్టోబర్ 12న జంగ్ సైరన్: ఎస్టీయూ

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల సాధన కోసం అక్టోబర్ 12న ‘చలో హైదరాబాద్’ పేరిట ‘జంగ్ సైరన్’ నిర్వహించనున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ తెలిపారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో సుమారు లక్ష మంది కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. హక్కులను సాధించుకోవడానికి ఈ ఉద్యమ కార్యాచరణను ప్రకటించినట్లు వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
News August 20, 2025
మెదక్: ‘మళ్లీ జైలుకు రావొద్దు’

మెదక్ సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్.ఎం.సుభవల్లి తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న వసతులు, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ సలహాలు ఇచ్చారు. మీరు తప్పులు చేసి జైలుకు వస్తే మీ వల్ల మీ కుటుంబం ఇబ్బందులకు గురవుతుంది. మానసికంగా క్షోభకు గురవుతారన్నారు. కావున ఒకసారి జైలు నుంచి బయటకు వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ తప్పులు చేసి జైలుకు రావొద్దని సూచించారు.