News July 21, 2024
CRDA అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం బదిలీ

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అడిషనల్ కమిషనర్ కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆయన్ను రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్టు అధికారిగా నియమించారు. ITDA ప్రాజెక్టు అధికారిగా చేస్తున్న సూరజ్ గనోరే ధనుంజయ్‌ను పల్నాడు జేసీగా నియమించిన విషయం తెలిసిందే.
Similar News
News September 17, 2025
తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
News September 17, 2025
తురకపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటన

గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. జూన్, జులై నెలల్లో ఎదురయ్యే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు.
News September 17, 2025
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ రత్న షీలామణి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.