News July 21, 2024

బంగ్లాదేశ్‌లో హైటెన్షన్.. సెలవులు ప్రకటించిన సర్కార్

image

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. నేడు, రేపు కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు సురక్షితంగా భారత్ చేరారని, మరో 4వేల మందితో టచ్‌లో ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Similar News

News January 14, 2026

రేపు, ఎల్లుండి విజయ్‌ హజారే ట్రోఫీ సెమీఫైనల్స్

image

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్‌, విదర్భ, కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. నిన్నటి క్వార్టర్‌ఫైనల్లో పంజాబ్‌ 183 పరుగుల తేడాతో MPపై ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో విదర్భ 76 పరుగులతో ఢిల్లీని ఓడించింది. దీంతో రేపు జరిగే సెమీఫైనల్లో విదర్భ-కర్ణాటక తలపడనుండగా, ఎల్లుండి పంజాబ్‌-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్‌లు 18న ఫైనల్లో తలపడనున్నాయి.

News January 14, 2026

నిష్క్రమిస్తోన్న ఈశాన్య రుతుపవనాలు

image

AP: ఈశాన్య రుతుపవనాలు 3 రోజుల్లో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి నిష్క్రమించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గాలుల దిశలో మార్పుతో క్రమంగా వైదొలుగుతాయని పేర్కొంది. మరోవైపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. శివారు ప్రాంతాలు, ఏజెన్సీల్లో మంచు కురుస్తోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News January 14, 2026

గర్భిణుల్లో విటమిన్ D లోపం ఉంటే ఈ సమస్యలు

image

ప్రెగ్నెన్సీలో మహిళలు అన్ని పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. అప్పుడే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టుక‌తో ఎలాంటి లోపాలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గ‌ర్భిణుల్లో విట‌మిన్ డి లోపం ఉండ‌డం వ‌ల్ల శిశువులు అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు, మ‌ల్టిపుల్ స్లెరోసిస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్ D లోపం లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.