News July 21, 2024
ఒత్తిడి పెరుగుతున్నా తగ్గనంటున్న బైడెన్!

US అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేస్తున్న బైడెన్ సొంత పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా లెక్కచేయడం లేదు. కరోనా సోకి ఐసొలేషన్‌లో ఉన్న బైడెన్ ఎంత మంది కీలక వ్యక్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో డెమోక్రాట్లు సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఇప్పటికే అనేకసార్లు తన తడబాటుతో అసంతృప్తి మూటగట్టుకున్న బైడెన్ మున్ముందు ఎలా రాణిస్తారనేది చర్చనీయాంశమైంది.
Similar News
News November 7, 2025
ప్రకాశం జిల్లాలో 16పోస్టులు.. అప్లై చేశారా?

ఏపీలోని ప్రకాశం జిల్లాలో శిశుగృహ, బాల సదనంలో 16 ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సైకాలజీ డిప్లొమా, న్యూరో సైన్స్, LLB,పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ, బీఈడీ, బీఏ బీఈడీ, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.
News November 7, 2025
DECలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్: మంత్రి కోమటిరెడ్డి

TG: రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ ద్వారా డిసెంబర్ 19-21 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందుకోసం రూ.30 లక్షల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన లోగోను గవర్నర్ జిష్ణుదేవ్ ఇటీవల ఆవిష్కరించారు.
News November 7, 2025
కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై TG డైలమా

TG: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. దీనికి మద్దతివ్వాలా? లేదా అనే దానిపై ఇంకా డెసిషన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. BILLలోని డిస్కామ్‌ల ప్రైవేటీకరణ, అగ్రి ఇతర రంగాలకు సబ్సిడీల తగ్గింపు తదితరాలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే నిధుల కేటాయింపు వంటి అంశాలూ ఉండడంతో తర్జనభర్జన పడుతున్నారు. NOV 8లోగా అభిప్రాయాలు పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.


