News July 21, 2024
ఈ నెల 25న బడ్జెట్

TG: ప్రభుత్వం ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె. రామకృష్ణారావు తెలిపారు. సుమారు రూ.2.85లక్షల కోట్లతో పద్దును రూపొందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై సమగ్ర వివరాలను ఆర్థిక శాఖ ఇప్పటికే CMకు అందించింది. దానిపై ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్‌లో క్యాబినెట్ చర్చించనుంది. అదే రోజు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో పద్దును ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News September 19, 2025
ఈ అసెంబ్లీ సమావేశాలకూ వైసీపీ దూరం?

AP: YCP MLAలు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్న పదేపదే కోరినా.. ఇవాళ YCP సభ్యులెవరూ సమావేశాలకు రాలేదు. ఇదే సమయంలో ఆ పార్టీ LP సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. మండలి సభ్యులే బలంగా పోరాడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకునే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని జగన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
News September 19, 2025
మోదీతో మంచి స్నేహం ఉంది: ట్రంప్

భారత్, PM మోదీతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మోదీతో మంచి స్నేహం ఉందని, ఆ కారణంగానే ఆయనకు నిన్న బర్త్ డే విషెస్ తెలిపానన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ద్వైపాక్షిక భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చమురు కొనుగోళ్లు ఆపేస్తేనే రష్యా దిగి వస్తుందని చెప్పారు. చైనా ఇప్పటికే అమెరికాకు భారీ టారిఫ్‌లు చెల్లిస్తోందని, మరిన్ని విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
News September 19, 2025
SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?