News July 21, 2024

నిజామాబాద్: బాలుడి కిడ్నాప్ కేసులో వీడిన మిస్టరి

image

GGHలో శనివారం మూడేళ్ల బాలుడు<<13667747>> కిడ్నాప్<<>> అయిన విషయం తెలిసిందే. ఆ కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 6 బృందాలుగా విడిపోయి గాలించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఆర్మూర్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి మెట్‌పల్లి వద్ద సా.4గంటలకు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన చెల్లికి పిల్లలు లేకపోవడంతో తన స్నేహితుడితో కలిసి ఈ కిడ్నాప్ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

Similar News

News August 20, 2025

NZB: ‘ఇష్టారాజ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు’

image

పాలకవర్గం లేని కారణంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ (BLTU) రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు రావడం లేదని, వారికి సంబంధించిన ఫైల్స్ ముందుకు కదలడం లేదన్నారు. దీనితో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు.

News August 20, 2025

NZB: మొదలైన కదలిక..!

image

నిజామాబాద్ జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో కదలిక మొదలయ్యింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 2BHK కోసం అర్హులను ఎంపిక చేసేందుకు విచారణ జరుపుతున్నారు. కాగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జిల్లాలో 19,397 ఇండ్లు లక్ష్యానికి 17,301 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 9,486 మార్కింగ్ పూర్తి అయ్యాయి. ఇందులో NZB (U) 900, NZB (R) 502, బాల్కొండ 1176, బోధన్ 1553, బాన్సువాడ 4807, ఆర్మూర్ 548 ఇండ్లు ఉన్నాయి.

News August 20, 2025

NZB: ‘5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ’

image

నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా జిల్లాకు 67,529 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇందులో మంగళవారం వరకు 62,254 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు. 5,275 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. కాగా గత 2024 వానాకాలం సీజన్లో జిల్లాలో 68,244.8 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించారు.