News July 21, 2024
వర్షాకాలంలో విద్యుత్ తీగలతో జాగ్రత్త!

భారీ వర్షాల వల్ల ప్రజలు విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా తడిసిన మోటార్లతో రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు. ప్రజలు ఇంటి సర్వీస్ వైర్లని కాని, వాటితో వేలాడే ఇనుప తీగలను కానీ బట్టలు ఆరేసుకునే తీగలకు దగ్గరలో విద్యుత్ వైర్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులకు తెలపాలని కోరారు.
Similar News
News August 20, 2025
ఖమ్మం: వీధి కుక్కల బెడద.. ప్రజల బెంబేలు

నేలకొండపల్లి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువు మాదారం, పైనంపల్లి, బుద్ధారం గ్రామాల్లో కుక్కలు పశువులపై, మనుషులపై దాడులకు దిగుతున్నాయని చెబుతున్నారు. ఈ నెలలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 60కి పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
News August 20, 2025
రైతులకు షరతులు పెడుతున్న దుకాణాలపై కేసులు: ఖమ్మం CP

యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని రైతులకు షరతులు పెడుతున్న 5 ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. బుధవారం నేలకొండపల్లి, చింతకాని, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలాల్లోని ఎరువుల దుకాణాలలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారని చెప్పారు. రైతులు సైతం యూరియా కొనుగోలు సమయంలో దుకాణదారులు ఏమైనా షరతులు పెడితే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
News August 20, 2025
సైబర్ మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి: సీపీ

సైబర్ మోసాలకు గురై పోగొట్టుకున్న నగదు బాధితులకు రీఫండ్ చేసే వరకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని ఖమ్మం CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం వీసీ ద్వారా పోలీస్ అధికారులకు సీపీ పలు సూచనలు చేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే ‘గోల్డెన్ అవర్’లో సైబర్ మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. బాధితులు 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.