News July 21, 2024
హసనపర్తి: తల్లిదండ్రులు చనిపోయారని యువకుడి ఆత్మహత్య

తల్లిదండ్రులు చనిపోయారని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హసనపర్తి మండలం పెగడపల్లికి గ్రామానికి చెందిన పిన్నింటి హరీశ్(30) తల్లిదండ్రులు కొంత కాలం క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి ఇంటిలో ఒక్కడే ఉంటూ మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈనెల 18న పురుగు మందు తాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News August 20, 2025
వరంగల్ జిల్లాలో తగ్గిన వర్షాలు

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు 105 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా సంగెంలో 18.4, నెక్కొండ 15.1, పర్వతగిరి 13.8 మి.మీ. వర్షం కురిసింది. చెన్నారావుపేటలో 12.3, ఖిల్లా వరంగల్, వర్ధన్నపేటలో 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. తక్కువగా వరంగల్ పట్టణంలో 2.4 మి.మీ. వర్షం నమోదైంది.
News August 20, 2025
WGL: నకిలీ డాక్టర్లను పట్టుకున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం

అర్హత లేకుండా క్లినిక్ నడుపుతున్న సెంటర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఇద్దరు నకిలీ డాక్టర్లను పట్టుకున్నట్లు కౌన్సిల్ సభ్యుడు డా.వి.నరేశ్ కుమార్ తెలిపారు. వరంగల్, కాశిబుగ్గ తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ డాక్టర్ అని పోస్టర్లు కొట్టించుకొని, ఆర్ఎంపీల జిల్లా ప్రెసిడెంట్‌గా చెప్పకుంటూ రోగులను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.
News August 20, 2025
వరంగల్: పెండింగ్ భూ భారతి సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

పెండింగ్ భూ భారతి సమస్యలపై నివేదికలు తయారు చేయాలని ఆర్డీవో, తహశీల్దార్లకు కలెక్టర్ సత్య శారద సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. భూ భారతి దరఖాస్తుల పెండెన్సీపై సమీక్ష నిర్వహించి, వారం రోజుల్లో పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.