News July 21, 2024

పెద్దపల్లి: మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన మహిళ మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పడేసిన ఘటన ఈనెల 8న పారుపల్లిలో జరిగింది. కాగా, ఈ కేసును మంథని సీఐ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో పోలీసులు ఛేదించారు. అప్పు నుంచి తప్పించుకోవడానికి అమ్ము రజితను ఆమె భర్త తిరుపతి గొంతు నులిమి చంపగా, జేసీబీ డ్రైవర్ రవి సంచిలో మూటకట్టి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 7, 2024

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఘనంగా మహాలింగార్చన

image

కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రిత్వచ్ఛారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాలింగ అర్చన చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మహాలింగార్చన ప్రమిదలను వెలిగించారు. మహా లింగార్చన కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

News October 7, 2024

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: MLA గంగుల

image

జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల బహిరంగ లేఖ రాశారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు.‌ ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తారా? అని పేర్కొన్నారు. దసరాకు జర్నలిస్టుల కుటుంబాల్లో పండగ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.

News October 7, 2024

కరీంనగర్ జర్నలిస్టులు ఏం అన్యాయం చేశారు: బండి సంజయ్

image

కరీంనగర్ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై బండి సంజయ్ స్పందించారు.‌ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? బతుకమ్మ పండుగకు ముందు జర్నలిస్టుల బతుకులతో ఆటలా?. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే?’ అని ప్రశ్నించారు.