News July 21, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,538 మంది భక్తులు దర్శించుకోగా 30,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామివారికి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.
Similar News
News January 24, 2025
పోలీసులకు గురుమూర్తి సవాల్!
TG: భార్య వెంకటమాధవిని అత్యంత క్రూరంగా <<15235940>>చంపిన<<>> గురుమూర్తి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ‘అవును నేనే చంపా. మీ వద్ద సాక్ష్యాలున్నాయా? నాపై కేసు పెట్టి రిమాండ్ చేయండి. అంతా కోర్టులోనే చూసుకుంటా’ అని సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. ఇంట్లో రక్తం మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవడంతో ‘ముక్కలు’గా నరికిన విషయం నిజమేనా? లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా? అని పోలీసులు ఆలోచనలో పడ్డట్లు సమాచారం.
News January 24, 2025
NEFT/RTGS సిస్టమ్ హ్యాక్: సైబర్ నేరగాళ్ల బ్యాంకు దోపిడీ
కర్ణాటక విజయనగరలో డిజిటల్ దోపిడీ జరిగింది. బళ్లారి కోఆపరేటివ్ బ్యాంకు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు కొట్టేశారు. బ్యాంకు NEFT/RTGS లావాదేవీల వ్యవస్థను లక్ష్యంగా ఎంచుకొని హ్యాకింగ్ చేశారు. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, IFSC కోడ్స్‌ను మ్యానిపులేట్ చేశారని తెలిసింది. జనవరి 10న జరిగిన ఈ దోపిడీపై FIR నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News January 24, 2025
సైఫ్ స్టేట్మెంట్: కరీనా, పనిమనిషి పాత్రలపై మళ్లీ డౌట్స్!
యాక్టర్ <<15240990>>సైఫ్<<>> అలీఖాన్ స్టేట్‌మెంటుకు దాడి జరిగిన రోజు సంఘటనలకు పొంతన కుదరడం లేదని కొందరు అంటున్నారు. 11వ ఫ్లోర్లో ఉన్న కరీనా, తాను జే రూమ్‌కు వెళ్లామని సైఫ్ చెప్పారు. ఆగంతకుడిని చూశాక జేను వేరే గదిలోకి తీసుకెళ్లామన్నారు. కరీనా తనతోనే ఉన్నప్పుడు దాడి జరగ్గానే ఆమే ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదన్నది ప్రశ్న? గదిలో బంధించిన షరీఫుల్ ఎలా తప్పించుకున్నాడు? ఈ ఘటనలో పని మనిషి పాత్రేంటో తెలియాల్సి ఉంది.