News July 21, 2024

క్షేత్రస్థాయి పర్యటనలు.. ఆకస్మిక తనిఖీలు!

image

క్షేత్రస్థాయి పర్యటనలతో కలెక్టర్ నారాయణరెడ్డి జోరు పెంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలు, NLGలోని పలు శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడిన బాలసదనం, సఖి, శిశు గృహాల్లో మౌలిక సదుపాయాలకు గత కలెక్టర్ హరిచందన కృషి చేయగా.. ఆ సంప్రదాయాన్ని ప్రస్తుత కలెక్టర్ కొనసాగిస్తున్నారు.

Similar News

News August 20, 2025

NLG: ఇక గ్రామాల్లో ఉపాధి జాతర..!

image

జిల్లాలోని అన్నీ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల జాతర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ‘పనుల జాతర -2025’ లో భాగంగా ఈనెల 22న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రూ. 3750.86 లక్షలతో 3918 పనులకు అనుమతులు ఇచ్చినట్లు డీఆర్డీఓ వై. శేఖర్ రెడ్డి తెలిపారు.

News August 20, 2025

జిల్లాలో యూరియాకు కొరత లేదు: కలెక్టర్ ఇలా

image

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని ఆమె వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.

News August 20, 2025

NLG: నల్గొండ జిల్లాలో 45% అధిక వర్షం

image

జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే 45 శాతం అధిక వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో 20 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జులై చివరి వరకు జిల్లాలో లోటు వర్షపాతం నమోదవగా.. ఆగస్టు తొలి వారం నుంచి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసి అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు 399 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.