News July 21, 2024

అన్ని స్కూళ్ల టైమింగ్స్ ఇవే

image

తెలంగాణలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, <<13668481>>ఉన్నత పాఠశాలలు <<>>ఇకపై ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. 7వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత స్కూళ్లు, హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు నిర్వహిస్తారు. HYD, సికింద్రాబాద్‌లో మాత్రం ట్రాఫిక్ దృష్ట్యా స్కూళ్లు ఉదయం 8.45 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి.

Similar News

News November 5, 2025

డెలివరీ తర్వాత బెల్టు వాడితే పొట్ట తగ్గుతుందా?

image

ప్రసవం తర్వాత పొట్టను తగ్గించడానికి చాలామంది అబ్డామినల్ బెల్టును వాడతారు. అది పొట్ట కండరాలకు ఆసరాగా, సౌకర్యంగా ఉంటుంది కానీ పొట్టను తగ్గించడంలో ఉపయోగపడదంటున్నారు నిపుణులు. వదులైన మజిల్స్ తిరిగి సాధారణ స్థితికి రావాలంటే వ్యాయామం తప్పనిసరి అని చెబుతున్నారు. క్రంచెస్‌, స్ట్రెయిట్‌ లెగ్‌ రైజింగ్‌, ప్లాంక్స్‌ లాంటి కొన్ని వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే పొట్ట తగ్గుతుందని సూచిస్తున్నారు.

News November 5, 2025

ఎన్టీఆర్ ఊర మాస్ లుక్

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఆకట్టుకుంటోంది. ఇవాళ ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చిన ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్‌ తీస్తోన్న మూవీ షూట్‌లో బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా బరువు తగ్గడంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ బియర్డ్ లుక్‌లో NTR హ్యాండ్సమ్‌గా ఉన్నారని, ‘డ్రాగన్’ మూవీ లుక్ ఇలానే ఉంటుందా? అంటూ పోస్టులు చేస్తున్నారు. తారక్ లుక్ ఎలా ఉంది? COMMENT

News November 5, 2025

సమాజ అవసరాలకు అనుగుణంగా విజన్: CBN

image

సమష్టి బాధ్యతతో అధికారులు, పారిశ్రామికవేత్తలు భవిష్యత్తరాలకు సరైన మార్గన్ని నిర్దేశించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. ప్రపంచం, సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు తమ విజన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. నూతన సాంకేతికతతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. తన సతీమణికి యూకే డిస్టింగ్విష్ ఫెలోషిప్-2025 అవార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.