News July 21, 2024

నెల్లూరులో ఈ నెల 23న జాబ్ మేళా

image

నగరంలోని ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ తెలిపారు. మహాలక్ష్మిపురం శరత్ ఇండస్ట్రీలో ఖాళీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగంలో పనిచేయటానికి ఐటిఐ, డిప్లోమో, బీటెక్ చదివిన విద్యార్థులు ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 12, 2026

ఊర్లకు వెళ్లేవారు LHMS యాప్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

image

సంక్రాంతి పండుగను ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల కోరారు. ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్‌ను వాడాలని సూచించారు. రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచామన్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలని తల్లిదండ్రులను హెచ్చరించారు. సంప్రదాయం పేరుతో కోడిపందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News January 12, 2026

నెల్లూరు: రూ.1.20 కోట్ల విలువైన లగ్జరీ కార్లు స్వాధీనం

image

అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నిందితులు ఇతర రాష్ట్రాల్లో లగ్జరీ కార్లను దొంగిలించి, నకిలీ నంబర్ ప్లేట్లు, డూప్లికేట్ పత్రాలతో విక్రయిస్తున్నారు. వారిని దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రూ.1.20 కోట్ల విలువైన 2 కార్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

News January 12, 2026

నెల్లూరు: మీకు విద్యుత్ సమస్యలా.?

image

నెల్లూరు జిల్లా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం “డయల్ యువర్ ఎస్ఈ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ కె.రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు 0861–2320427 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను నేరుగా తెలియజేయవచ్చు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.