News July 21, 2024
చేనేత, జౌళి శాఖలో కొలువుల భర్తీ
TG: చేనేత, జౌళి శాఖలో 30 ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన వారు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. IIHT నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలకు tsht.Telangana.gov.in ను సందర్శించాలని స్పష్టం చేసింది.
Similar News
News December 26, 2024
Latest Data: ఓటింగ్‌లో మహిళలే ముందు
2024 సార్వత్రిక ఎన్నికల్లో 65.78% మంది అర్హత కలిగిన మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. పురుషులు 65.55% మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. తద్వారా వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయడం గమనార్హం.
News December 26, 2024
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?
ట్యాక్స్ పేయర్స్‌కి ఊరట కలిగించేలా 2025 బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన పన్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 లక్షల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశం అర్థిక సవాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో Tax Payersకి ఊరట కలిగించేలా Budgetలో నిర్ణయాలుంటాయని సమాచారం.
News December 26, 2024
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు 118 నియోజకవర్గాల్లో 72 లక్షల ఓట్లను జోడించారని, అందులో 102 చోట్ల BJP విజయం సాధించిందన్నారు. LS ఎన్నికల తరువాత AS ఎన్నికలకు ముందు ఈ అక్రమాలు జరిగినట్టు వివరించారు. అయితే, ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను చేర్చడం సాధ్యంకాదని ఇటీవల EC వివరణ ఇవ్వడం తెలిసిందే.