News July 21, 2024
HYD: రూ.5కే టిఫిన్..!

గ్రేటర్ HYDలో ప్రస్తుతం 320కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ.5కే భోజనం అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.
Similar News
News February 5, 2026
HYD: మీరు గ్రేట్ సారూ.. ఉద్యోగం మానేసినా బదిలీ చేశారు!

జీహెచ్ఎంసీలో పలువురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే విచిత్రమేమంటే.. కొందరు ఉద్యోగాలు మానేసినా వారి పేరు బదిలీల్లో ఉండటం చర్చనీయాంశమైంది. శేరిలింగంపల్లిలో తాహేర్, అలేఖ్య, సుభాషిణిలు ఎప్పుడో జాబ్ మానేశారు. అయితే బదిలీల్లో వీరు పేరుంది. మరి జీతాలు కూడా వారి పేరిట డ్రా అవుతున్నాయేమో అని కొందరు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.
News February 5, 2026
HYD: తాజా సర్వేలో భయంకరమైన నిజాలు

హైదరాబాద్ నగరానికి కూరగాయలు సరఫరా అయ్యే ప్రధాన ప్రాంతాల్లో జరిపిన తాజా పరిశీలనలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని పారిశ్రామిక వ్యర్థాల నీటితో పండించే ఆకుకూరల్లో లెడ్ (సీసం), కాడ్మియం వంటి భారలోహాలు పరిమితికి మించి 40% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇవి నేరుగా జీర్ణకోశ క్యాన్సర్లకు (Stomach Cancer) దారితీస్తున్నాయి. దీంతో గత రెండేళ్లలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కేసులు 18% పెరిగాయి.
News February 5, 2026
HYD: హైడ్రా కమిషనర్‌తో ప్రతి శనివారం PHONE IN

ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతి శనివారం ‘ఫోన్-ఇన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సోమవారం జరిగే ‘ప్రజావాణి’కి అదనంగా, ఇకపై శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు కమిషనర్ రంగనాథ్ ఈ ప్రోగ్రాంలో అందుబాటులో ఉంటారు. చెరువులు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ORR పరిధిలోని ప్రజలు 040- 29565750, 040- 29565759 నంబర్లకు ఫోన్ చేసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.


