News July 21, 2024

మెగాస్టార్‌తో సినిమా.. కృష్ణవంశీ ఏమన్నారంటే?

image

దర్శకుడు కృష్ణవంశీ Xలో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేయమని ఆయనను ఓ నెటిజన్ కోరారు. ‘అన్నయ్యతో సినిమా అంటే ఆయనే డిసైడ్ చేయాలి. నాకు కూడా తనతో మూవీ చేయడం ఎప్పటికీ ఇష్టమే’ అని బదులిచ్చారు. ఇటీవల విడుదలైన సినిమాల్లో కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడిస్’ తనకు బాగా నచ్చిందని చెప్పారు.

Similar News

News October 26, 2025

దుక్కి సమస్య నేలల్లో బాగా మొలక రావాలంటే?

image

మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువుగా దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇక్కడ వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పంట సరిగా మొలకెత్తదు. ఇలాంటి సమస్య ఉన్న భూముల్లో మొదట మాములుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే రోటవేటర్ (లేదా) పళ్లదంతెతో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి అనువైన దుక్కి వస్తుంది.

News October 26, 2025

రాష్ట్రంలో 225 పోస్టులు.. అప్లై చేశారా?

image

తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష , సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750, SC/ST/PWBDలకు రూ.250. వెబ్‌సైట్:
https://tgcab.bank.in

News October 26, 2025

జమ్మి చెట్టును ఎందుకు పూజించాలి?

image

శమీ వృక్షాన్ని సకల దేవతల నివాసంగా భావిస్తారు. దసరా రోజున ఈ చెట్టు ఆకులను బంగారంగా భావించి ఇతరులకు పంచుతారు. ఇది శుభాలను, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. పాండవులు విజయాన్ని సాధించినట్టే, ముఖ్య కార్యాలకు, ముఖ్యమైన ప్రయాణాలకు వెళ్లే ముందు శమీ వృక్షాన్ని దర్శించుకోవడం మంచిదని పండితులు సూచిస్తుంటారు. ఈ వృక్షాన్ని పూజించడం వల్ల ఆ కార్యాలు విజయవంతమవుతాయని, అడ్డంకులు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం.