News July 21, 2024
నరసాపురం MPDO మిస్సింగ్.. వీడని మిస్టరీ

నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యం మిస్టరీ రోజురోజుకు మరింత చిక్కుముడిగా మారుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్ఐలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఏలూరు కాలువను వలలు వేసి జల్లెడపట్టినా ఎంపీడీవో ఆచూకీపై సమాచారం ఇసుమంతైనా లభించలేదు. దీంతో ఇతని ఫోన్‌కాల్ లిస్ట్, ఆర్థిక లావాదేవీలను మరింత నిశితంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఆర్థిక వివాదాలపైనా ఆరా తీస్తున్నారు.
Similar News
News January 1, 2026
భీమవరం: కేంద్ర మంత్రి వర్మకు న్యూఇయర్ శుభాకాంక్షలు

కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గురువారం ఆయన కార్యాలయంలో పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పలు ప్రజాహిత అంశాలపై వారు చర్చించారు.
News January 1, 2026
ప.గో: లక్ష్యం1,780.. కట్టింది ఏడే

కాళ్ల మండలం పెదమిరం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి గృహ నిర్మాణాలపై సమీక్షించారు. పీఎంఏవై 1.0 (ఆప్షన్-3) కింద 2025 డిసెంబర్ నాటికి 1,780 ఇళ్లు నిర్మించాల్సిన ‘అజాయ వెంచర్స్’ సంస్థ.. కేవలం 7 మాత్రమే పూర్తి చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం లక్ష్యం చేరుకోనందున సదరు నిర్మాణ సంస్థపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 1, 2026
తణుకు: దంపతులను ఢీ కొట్టిన లారీ.. భార్య మృతి

తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన అందే లోకేశ్వరరావు, అందే వెంకటలక్ష్మి (48) దంపతులు తాడేపల్లిగూడెం వైపు నుంచి తణుకు వైపు మోటార్ సైకిల్‌పై వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన లోకేశ్వరరావును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


