News July 21, 2024

శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు

image

శ్రీ భద్రకాళీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆదివారం భద్రకాళి అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా, అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.

Similar News

News November 10, 2025

వరంగల్‌ ప్రజలు ఈ వారం జాగ్రత్త

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 నుంచి వారం రోజులపాటు చలి పంజా విసరనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 11 నుండి 19 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో 11 నుంచి14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు, మహబూబాబాద్ జిల్లాలో 14 నుంచి 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

News November 9, 2025

HNK: జాబ్ మేళాలో 214 మందికి ఉద్యోగాలు

image

హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ స్కూల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళ నిర్వహించారు. ఇందులో 214 మందికి ఉద్యోగాలు పొందారని హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వెల్లడించారు. జాబ్ మేళాకు 1200 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా 600 పైచిలుకు హాజరయ్యారన్నారు. 24 సంస్థలు వివిధ రంగాల్లో 214 మంది విద్యార్థులకు అపాయింటుమెంట్ పత్రాలు అందజేశారని తెలిపారు.

News November 9, 2025

పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించండి: టీఐయూఎఫ్

image

ఉపాధ్యాయుల పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఐయూఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. వరంగల్‌లోని కృష్ణ కాలనీ పాఠశాలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్‌ టీచర్స్‌ బెనిఫిట్స్ చెల్లించాలని, సర్దుబాటును పారదర్శకంగా నిర్వహించాలని, ఇన్-సర్వీస్‌ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు.