News July 21, 2024

HYD: UPDATE.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం

image

చైతన్యపురి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని వేణుశ్రీ<<13674167>> ఆత్మహత్యాయత్నానికి<<>> పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. ‘రేపటి వరకు ఉంటానో.. ఉండనో తెలియదు డాడీ.. I’M SORRY’ నేను నా వరకు ట్రై చేస్తున్నా. కానీ మీ పేరు నిలబెట్టలేనేమో అని భయమేస్తుంది’ అని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

Similar News

News September 8, 2025

రూ.298 కోట్లతో కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో పాటు కోకాపేట లేఅవుట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు నేడు CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో కోకాపేట లే అవుట్, నియోపొలిస్, స్పెషల్ ఎకనామిక్ జోన్(SEZ)లో‌ తాగునీరు, నూతన మురుగునీటి వ్యవస్థ‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కీలక ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

News September 8, 2025

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2కు శ్రీకారం

image

గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్‌ ఫేజ్ 2, 3‌తో రూ.1,200 కోట్లతో ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-2ను CM రేవంత్‌ ప్రారంభిస్తారు. GHMC, సిటీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ORR పరిధి GPలకు నీటి సరఫరా అందించాలనేది దీని లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా.. ఇందులో కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను CM ప్రారంభించనున్నారు.

News September 8, 2025

ORR: తాగునీరు అందే ప్రాంతాలు ఇవే

image

ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2తో సిటీ శివారు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తీరనున్నాయి. దాదాపు 14 మండలాల్లోని 25 లక్షల మంది ప్రజలకు మేలు జరగనుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్, RCపురం, పటాన్‌చెరు, బొల్లారం ప్రాంత వాసులకు మంచినీరు అందించనున్నారు.