News July 21, 2024

దావూద్‌తో సంబంధం ఉన్నోళ్లంతా ఉగ్రవాదులు కాదు: బాంబే హైకోర్టు

image

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్న ఫైజ్, పర్వేజ్ అనే ఇద్దరికి బాంబే హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దావూద్‌తో సంబంధమున్నంత మాత్రాన ఉగ్రవాదులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ‘UAPA చట్టం కేవలం దావూద్‌పై ప్రయోగించారు. అతడి ముఠాతో సంబంధం ఉన్నవారికి అది వర్తించదు’ అని స్పష్టం చేసింది. ఫైజ్ వద్ద పట్టుకున్న 600 గ్రాముల గంజాయి స్వల్ప మొత్తమేనని పేర్కొంది.

Similar News

News April 5, 2026

PHOTO GALLERY: ఉప్పల్‌లో SRH మ్యాచ్

image

IPL: ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH, LSG మ్యాచుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు 39వేల మంది వచ్చినట్లు సమాచారం. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ సైతం స్టేడియానికి వచ్చి ప్లేయర్లను ఎంకరేజ్ చేశారు. చేతిలో ఆరెంజ్ జెండా పట్టుకొని ఉత్తేజపరిచారు. SRH ఓనర్ కావ్య, లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా, ఇషాన్ కిషన్ ప్రేయసి అదితి హుండియా, బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్, నిర్మాత సురేశ్ బాబు సందడి చేశారు.

News April 5, 2026

ట్రంప్‌కు పిచ్చి పట్టిందా?

image

‘హార్ముజ్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవడం మాకో లెక్క కాదు. రెండు నిమిషాల పని’ అని 6 రోజుల క్రితం ట్రంప్ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో మంగళవారం లోపు దాన్ని తెరవాలని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు బా*ర్డ్స్ అంటూ చిల్లర భాష మాట్లాడారు. దీంతో ట్రంప్ మెదడు పని చేస్తోందా? అని నెటిజన్లు ఫైరవుతున్నారు. యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.

News April 5, 2026

ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.