News July 21, 2024

నిఫా వైరస్.. 14 ఏళ్ల బాలుడు మృతి

image

కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మళప్పురం జిల్లాకు చెందిన బాలుడికి శుక్రవారం నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈరోజు ఉదయం మూత్రం ఆగిపోయిందని, కాసేపటికే తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. 2018 నుంచి కేరళలో నిఫా వైరస్ వల్ల 21 మంది చనిపోయారు.

Similar News

News January 24, 2025

మొన్న చిలుకూరులో.. నేడు దోమకొండలో ప్రియాంక పూజలు

image

TG: హీరోయిన్ ప్రియాంకా చోప్రా కామారెడ్డి(D) దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయంలో పూజలు చేశారు. హీరో రామ్‌చరణ్ మామ వంశస్థులకు చెందినదే ఈ దోమకొండ గడికోట. ‘జంజీర్’ మూవీ సమయంలో గడికోట గురించి ప్రియాంకకు చెర్రీ, ఉపాసన చెప్పడంతో తాజాగా ఆమె అక్కడికి వెళ్లారు. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయాన్నీ ప్రియాంక దర్శించుకున్నారు. రాజమౌళి-మహేశ్ సినిమాలో నటించేందుకు ఆమె HYD వచ్చినట్లు తెలుస్తోంది.

News January 24, 2025

ఎల్లుండి రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ విడుదల

image

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈనెల 26న చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.

News January 24, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం

image

హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా నరికి <<15241806>>ముక్కలు ఉడికించిన <<>>కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి DNA శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల DNAతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు.