News July 21, 2024

HYD: ‘ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలి’

image

ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం రాష్ట్ర ఛైర్మన్ చీమ శ్రీనివాస్ బషీర్‌బాగ్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.

Similar News

News November 8, 2025

జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

image

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.

News November 8, 2025

జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

News November 8, 2025

జూబ్లీ బైపోల్: మీకేం కావాలి? ఎంత కావాలి?’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం రేపటితో క్లోజ్. ఇక వీధులు, బస్తీలు నిర్మానుష్యంగా మారుతాయి. సీన్ కట్ చేస్తే ప్రధాన నాయకుల ఇళ్లకు, గెస్ట్ హౌసులకు షిఫ్ట్ అవుతుంది. ప్రచారం ముగియగానే మంతనాలు షురూ అవుతాయి. గంపగుత్తగా ఓట్లు వేయించే వారిని ఇంతకుముందే గుర్తించిన నాయకులు వారితో రేపు చర్చలు జరిపే అవకాశముంది. ప్రతీ ఎన్నికల ముందులాగే.. మీకేం కావాలి? ఎంత కావాలి? అంటూ ప్రలోభపెడుతూ ఓట్లు రాబట్టుకునే పనిలో ఉంటారు.