News July 21, 2024
HYD: ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి..!

HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.
Similar News
News January 17, 2026
భూగర్భంలో JBS- శామీర్‌పేట మెట్రో..!

హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2లో భాగంగా జేబీఎస్(JBS) నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారి మీదుగా సుమారు 17 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. ఇది ఉత్తర హైదరాబాద్ ప్రయాణాన్ని సులభతరం చేసే కీలక ప్రాజెక్ట్. ఈ దారిలో ఉన్న హకీంపేట ఎయిర్ బేస్ రక్షణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం అక్కడ మెట్రోను పిల్లర్లపై కాకుండా భూగర్భంలో (<<18874590>>Underground<<>>) నిర్మించాల్సి వస్తోంది.
News January 17, 2026
HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.
News January 17, 2026
రాడార్ల కోసం ‘అండర్ గ్రౌండ్’ మెట్రో

జేబీఎస్-శామీర్‌పేట మెట్రో వైర్ల నుంచి వెలువడే హై-వోల్టేజ్ కరెంటు యుద్ధ విమానాల రాడార్లకు ముప్పుగా మారుతుందని 2025 చివరలో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రేడియేషన్ వల్ల విమానాల ‘టార్గెట్ లాకింగ్’ సిస్టమ్స్ దెబ్బతింటాయని తేలింది. అందుకే ఈ కారిడార్‌లో హకీంపేట వద్ద మెట్రోను <<18874537>>భూమి లోపల<<>> సొరంగంలో తీసుకెళ్తే ఆ మట్టి ఒక సహజ కవచంలా పనిచేసి సిగ్నల్స్ బయటకు రాకుండా ఆపుతుందని ప్లాన్ చేశారు.


