News July 21, 2024
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం

బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రజలకు తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామన్న ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ‘ఈ విషయాలను కేంద్రం చూసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. మీ వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి’ అని స్పష్టం చేసింది. బంగ్లాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి పౌరులకు ఆశ్రయం కల్పించేందుకు బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మమత వ్యాఖ్యానించారు.
Similar News
News February 1, 2026
MDK: మున్సిపల్ ఎన్నికలు.. ప్రజావాణి వాయిదా

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 1, 2026
పోలవరానికి తగ్గిన నిధుల కేటాయింపు

AP: FY26-27 కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టుకు ₹3320 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో ₹5936 కోట్లు ఇచ్చారు. అయితే గత ఏడాది ఎక్కువ నిధులు కేటాయించినా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ₹3017 కోట్లు మాత్రమే వచ్చాయి. పోలవరం వాటర్ స్టోరేజి లెవల్‌ను 41.15 మీటర్లకు కుదించినట్లు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
News February 1, 2026
ఫోన్లు ట్యాప్ చేసి ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేశారు: TPCC చీఫ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR సిట్ విచారణ నేపథ్యంలో BRSపై TPCC చీఫ్ మహేశ్ గౌడ్ ఘాటుగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, గతంలో అనేకమంది CMలు విచారణ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ట్యాపింగ్‌ను అడ్డం పెట్టుకొని బిల్డర్లు, సినీ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేశారని, వందలాది మంది వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూశారని ఆరోపించారు. KCR ఆదేశాలు లేకుండా ఇంతపెద్ద ఎత్తున ట్యాపింగ్ జరగడం సాధ్యం కాదన్నారు.


