News July 21, 2024

తిరుమలలో శ్రీవారికి గరుడ సేవ

image

AP: గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఇవాళ స్వామి వారికి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. గరుడపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీమలయప్పస్వామి భక్తులను కటాక్షించారు. కాగా ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తోంది.

Similar News

News January 24, 2025

WOW: నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913km సైకిల్ తొక్కి..

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.

News January 24, 2025

ఘోరం: యువతిని రేప్ చేసి ప్రైవేట్ పార్ట్స్‌లో..

image

ముంబైలో ‘నిర్భయ’ తరహా ఘటన సంచలనం రేపుతోంది. 20ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు చొప్పించాడు. అతడి నుంచి తప్పించుకున్న బాధితురాలు గొరేగావ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకొని విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి బ్లేడ్, రాళ్లను తొలగించారు.

News January 24, 2025

ట్రెండింగులో #AttackOnBSF

image

రెండు వారాల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న BSF జవాన్లపై బంగ్లాదేశీ పశువుల స్మగ్లర్లు అటాక్ చేశారు. జీవాలను తీసుకెళ్తుండగా ప్రశ్నించడంతో పదునైన వస్తువులతో వారి గొంతు, మెడ, ఛాతీ, తొడలపై దాడి చేశారు. కుటదా బోర్డర్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో మన జవాన్లపై ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలని ప్రశ్నిస్తూ నెటిజన్లు #AttackOnBSFను ట్రెండ్ చేస్తున్నారు.