News July 21, 2024

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా KKR మాజీ ప్లేయర్!

image

టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను నియమించేందుకు BCCI అంగీకరించినట్లు సమాచారం. శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ BCCIకి సూచించారు. 2014 IPL సీజన్‌లో గంభీర్‌ KKR కెప్టెన్‌ కాగా మార్కెల్ జట్టులో ఉన్నారు. గంభీర్ లక్నోకి మెంటార్‌గా ఉన్నప్పుడు ఆయన బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News January 24, 2025

ICC ODI జట్టులో భారత ప్లేయర్లకు నో ఛాన్స్

image

మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఏ ఒక్కరూ స్థానం సంపాదించలేకపోయారు. పాక్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు లభించింది. 11 మందితో కూడిన జట్టుకు శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను సారథిగా ఎంపిక చేసింది. జట్టు: సయూమ్ అయూబ్, రహ్మానుల్లా గుర్బాజ్, నిస్సాంక, కుశాల్ మెండిస్, అసలంక (C), రూథర్‌ఫర్డ్, ఒమర్జాయ్, హసరంగ, షాహీన్ షా అఫ్రీది, హారిస్ రవూఫ్, ఘజన్‌ఫర్.

News January 24, 2025

గంగూలీ బయోపిక్.. హీరో ఇతడేనా?

image

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు దాదా రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. ‘ఉడాన్’ ఫేమ్ విక్రమాదిత్య మొత్వానీ దర్శకత్వం వహిస్తారు. కాగా గంగూలీ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు మూవీ మేకర్స్ 2021లోనే ప్రకటించారు.

News January 24, 2025

WOW: నేతాజీ ఆకారంలో రూట్ మ్యాప్.. 913km సైకిల్ తొక్కి..

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఓ సైక్లిస్ట్ వినూత్నంగా నివాళులర్పించారు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన సైక్లిస్ట్ అనిల్ కుమార్ బోస్ ఆకారంలో రూట్ మ్యాప్ గీసుకొని నగరంలో 11 రోజుల పాటు 913KMS తొక్కారు. నగరంలోని AOC సెంటర్‌లో ఆరంభించి ఫాక్స్ సాగర్ దగ్గర ముగించారు. తాను బోస్‌కు వీరాభిమాని కావడం వల్లే ఇలా చేసినట్లు అనిల్ తెలిపారు.