News July 21, 2024
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాచలం వద్ద రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరుకుంది. ఎగువనున్న ప్రాజెక్టులో నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో గోదావరి నీటిమట్టం గంటకు పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. మరో నాలుగు అడుగులు నీటిమట్టం పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతితో పాటు, 7-10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ చైతన్య జైనీ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
News January 17, 2026
ఖమ్మం: నగారా మోగకముందే.. ‘సర్వే’ సందడి!

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఎన్నికల నగారా మోగకముందే పలు సర్వే సంస్థలు రంగప్రవేశం చేసి ఆశావాహులను చుట్టుముడుతున్నాయి. ‘ఓటర్ల నాడి మాకు తెలుసు’ అంటూ నమ్మబలుకుతున్నాయి. పార్టీ టికెట్ల వేటలో ఉన్న అభ్యర్థులకు ఈనివేదికలు ఆయుధాలుగా మారుతాయని ఆశ చూపుతున్నాయి. మరోవైపు జిల్లా యంత్రాంగం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల కసరత్తును వేగవంతం చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
News January 16, 2026
ఖమ్మం: పులిగుండాల చెంత.. పక్షుల కిలకిలరావాలు!

ప్రకృతి ఒడిలో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు ‘బర్డింగ్ భారత్’ ఖమ్మం చాప్టర్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. జనవరి 18న పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద ‘బర్డ్ వాక్’ నిర్వహించనున్నారు. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు సాగే ఈ నడకలో పక్షుల జీవవైవిధ్యంపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గల వారు రూ. 250 ఫీజు చెల్లించి ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


