News July 21, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వరద ప్రవాహ సమయంలో వాగులు, వంకలు, కాలువలు దాటొద్దని సూచించింది. పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలంది.

Similar News

News September 16, 2024

పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి(PHOTOS)

image

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి ఆలయంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

News September 16, 2024

నీరజ్ చోప్రా తాజా ట్వీటుకు మనూ భాకర్ స్పందన ఏంటంటే?

image

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా త్వరగా కోలుకోవాలని షూటర్ మనూ భాకర్ ఆకాంక్షించారు. డైమండ్ లీగులో రజతంతో 2024లో ఈ సీజన్‌ను అద్భుతంగా ముగించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ సీజన్లో నేనెంతో నేర్చుకున్నాను. నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా నా ఎడమచేతికి ఫ్రాక్చర్ అయినట్టు ఎక్స్‌రే ద్వారా తెలిసింది. మీ సపోర్టుకు థాంక్స్’ అన్న నీరజ్ ట్వీటుకు మను స్పందించడం నెటిజన్లను ఆకర్షించింది.

News September 16, 2024

75ఏళ్లలో అతి పెద్ద తుఫాన్.. చైనాలోకి ఎంట్రీ

image

పెను తుఫాను బెబింకా చైనాలోని షాంఘైలో తీరం దాటింది. దాన్ని కేటగిరీ-1 తుఫానుగా పేర్కొంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. 1949లో గ్లోరియా టైఫూన్ తర్వాత గడచిన 75 ఏళ్లలో ఈస్థాయి తుఫాను రాలేదని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో షాంఘైలో వందలాది విమానాలను రద్దు చేశారు. కాగా గత వారమే చైనాలో యాగీ తుఫాను తీరం దాటిన సంగతి తెలిసిందే.