News July 22, 2024

నెల్లూరు: తొలిసారిగా ‘అధ్యక్షా’ అనబోయే MLAలు వీరే

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు కందుకూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆరుగురు ఇవాళ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అధ్యక్షా..అనే పదం పలకబోతున్నారు. పొంగూరు నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కాకర్ల సురేశ్, కావ్య కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, ఇంటూరి నాగేశ్వరరావు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నారాయణ గతంలో MLCగా, మంత్రిగా వ్యవహరించినా ఎమ్మెల్యేగా తొలిసారి సభలో అడుగుపెడుతున్నారు.

Similar News

News October 1, 2024

కోర్టు కేసులపై అధికారులు స్పందించాలి: కలెక్టర్ ఆనంద్

image

ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులపై జిల్లా అధికారులు స్పందించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News September 30, 2024

నెల్లూరు: SP కార్యాలయానికి 105 ఫిర్యాదులు

image

నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్లు ASP CH.సౌజన్య తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.

News September 30, 2024

SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.