News July 22, 2024
కర్ణాటకకు ఫోన్ పే సీఈఓ క్షమాపణలు

తాను కర్ణాటకను ఎప్పుడూ కించపరచలేదని ఫోన్ పే <<13661162>>CEO<<>> సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తనకు కర్ణాటకను అవమానించే ఆలోచన, ఉద్దేశం లేదని చెప్పారు. కర్ణాటకలోనే ఫోన్ పే పుట్టిందని, అలాంటి నేలను తాను ఎందుకు కించపరుస్తానన్నారు. కాగా కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానిక కోటాను సమీర్ వ్యతిరేకించడంతో ఫోన్ పే పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
Similar News
News January 7, 2026
‘జన నాయగన్’ వాయిదా.. రాజాసాబ్‌కు జాక్‌పాట్

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ ‘రాజాసాబ్’ జాక్‌పాట్ కొట్టింది. తమిళనాడులోని దాదాపు అన్ని మెయిన్ థియేటర్లలో జన నాయగన్ స్థానంలో రాజాసాబ్‌కు షోలు కేటాయిస్తున్నారు. దీంతో పండుగ వేళ తెలుగుతో పాటు తమిళంలో భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఈ రెండు సినిమాలు జనవరి 9కి రిలీజ్ కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలతో విజయ్ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
News January 7, 2026
ఎన్నికల్లో కూటమి దౌర్జన్యాలపై SEC, HCకి ఫిర్యాదు: జగన్

AP: MPP ఉప ఎన్నికల్లో కూటమినేతలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని YCP చీఫ్ జగన్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరపాల్సిన ఎన్నికను దౌర్జన్యంతో గెలుపొందడం దారుణమని మండిపడ్డారు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ MPTC సభ్యులు జగన్‌ను కలిసి ఎన్నికలో ప్రభుత్వ తీరును వివరించారు. కాగా రేపు 11amకి జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.
News January 7, 2026
తల్లి వాడే పర్ఫ్యూమ్ వల్ల బిడ్డ విలవిలలాడింది!

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన ఓ వింత కేసు MH పుణేలో జరిగింది. ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి 8 నెలల పాటు ఎడతెరిపి లేని దగ్గుతో విలవిలలాడింది. వైద్యులు మందులు మార్చినా తగ్గలేదు. కానీ ఒక నర్సు సూక్ష్మ పరిశీలన అద్భుతాన్ని చేసింది. ఆ తల్లి పర్ఫ్యూమ్ వల్లే బిడ్డ దగ్గుతోందని ఆమె గుర్తించింది. దానిని వాడటం మానేయగానే పాప కోలుకుంది. కొన్నిసార్లు మనం వాడే వస్తువులే పిల్లలను ఇబ్బందిపెడతాయని ఈ ఘటన గుర్తుచేస్తోంది.


