News July 22, 2024

కమలా హారిస్‌ని ఓడించడం ఈజీ: ట్రంప్

image

US అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైడెన్ కంటే కమలా హారిస్‌ను ఎన్నికల్లో ఓడించడం మరింత సులువని భావిస్తున్నట్లు స్థానిక మీడియాతో తెలిపారు. మరోవైపు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగేందుకు కూడా అర్హుడు కాదని విమర్శించారు.

Similar News

News January 20, 2026

విద్యార్థులు రోగాల బారిన పడకుండా కమిటీలు

image

AP: హాస్టళ్ల విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా 9 శాఖల అధికారులతో జిల్లాల్లో JACలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వైద్య, ఫుడ్‌ సేఫ్టీ, పంచాయతీ, మున్సిపల్, పశు సంవర్ధక, వ్యవసాయ, సంక్షేమ‌, గ్రామీణ నీటి పారుదల, విద్యా శాఖల అధికారులతో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. కాగా JACల తనిఖీలు నివేదికలకే పరిమితం కారాదని, లోపాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.

News January 20, 2026

ఇతిహాసాలు క్విజ్ – 129 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
సమాధానం: రావణుడి సోదరి అయిన శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. చేప వంటి కళ్లు గలది అని దీనర్థం. అయితే ఆమె గోళ్లు పెద్దవిగా ఉండేవి. అలాగే పదునుగా కూడా ఉండేవి. అందువల్లే ఆమెను ‘శూర్పణఖ’ అని పిలవడం మొదలుపెట్టారు. శూర్పణఖ అంటే జల్లెడ వంటి గోళ్లు కలది అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 20, 2026

హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్

image

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. నిండుగర్భంతో బ్లాక్ డ్రెస్సులో తాజాగా ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్ 2018లో ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే వాయు అనే కుమారుడు ఉన్నారు. 2007లో ‘సావరియా’తో తెరంగేట్రం చేసిన ఆమె భాగ్ మిల్కా భాగ్, నీర్జా, పాడ్ మ్యాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి సినిమాల్లో నటించారు.