News July 22, 2024

కాకినాడ: రొయ్యల కూర వండలేదని సూసైడ్

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన గొల్లప్రోలులో జరిగింది. SI జాన్ బాషా తెలిపిన వివరాలు.. మండలకేంద్రంలోని ఎస్సీపేటకు చెందిన బుచ్చిరాజు(23) శనివారం ఉదయం భార్యతో పచ్చిరొయ్యల కూర వండమని చెప్పాడు. బయటకెళ్లి తిరిగొచ్చాక కోడిగుడ్ల కూర వండటంతో భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటలకు తిరిగొచ్చి పురుగుమందు తాగాడు. కాకినాడ GGHకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదైంది.

Similar News

News December 16, 2025

గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

image

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్‌ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

News December 15, 2025

రాజమండ్రి: పీజీఆర్‌ఎస్‌కు 23 అర్జీలు

image

తూర్పుగోదావరి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 15, 2025

తూ.గో: రబీ యూరియా సరఫరాకు ప్రణాళిక సిద్ధం

image

జిల్లాలో రబీ సీజన్ (2025–26) పంటలకు అవసరమైన యూరియా సరఫరాకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు తెలిపారు. ఈ సీజన్‌కు 58.95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, డిసెంబర్ 1 నాటికి 3.40 వేల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వ అందుబాటులో ఉందని సోమవారం వెల్లడించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు.