News July 22, 2024
కొత్తగూడెం: 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఆరు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సుమారు 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. మొత్తం 11 ఏరియాల్లో రోజుకు 2 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 1.10 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీంతో ఆరు రోజుల్లో సుమారు 5 లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 18 ఓసీల్లో ఆరు రోజులు 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబికి అంతరాయం వాటిల్లింది.
Similar News
News September 12, 2025
ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు.
కలెక్టర్ గోడౌన్‌లోని సీల్‌ను, లోపల ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను పరిశీలించారు. ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాలు, స్లాబ్, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ అప్రమత్తతపై ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎన్నికల సామగ్రిని భద్రంగా ఉంచాలని ఆదేశించారు.
News September 12, 2025
ఖమ్మం: అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్&బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ వంటి శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రస్తుత పనులపై వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News September 11, 2025
బీసీల కులగణనలో తెలంగాణ ఆదర్శం: పొంగులేటి

బీసీల కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షా నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.